Ravichandran Ashwin: రోహిత్‌ శర్మ మాటలకు ఏం చెప్పాలో అర్థంకాలేదు: అశ్విన్‌

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్పాలో అర్థంకాలేదని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బీసీసీఐతో అన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్...

Published : 10 Mar 2022 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్పాలో అర్థంకాలేదని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బీసీసీఐతో అన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 222 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మాజీ సారథి కపిల్‌దేవ్‌(434) రికార్డును అధిగమించాడు. అనిల్‌కుంబ్లే (619) వికెట్లతో అందరికన్నా ముందుండగా అశ్విన్‌ (436) ఇప్పుడు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టు అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇదే విషయంపై అశ్విన్‌ తాజాగా బీసీసీఐతో మాట్లాడుతూ.. ‘రోహిత్‌ వ్యాఖ్యలకు ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తే వాటిని సరిగ్గా రిసీవ్‌ చేసుకోలేను. కెప్టెన్‌ మాటలకు ఎలా స్పందించాలో నాకు నిజంగా తెలియదు. కొన్నిసార్లు నేను భావోద్వేగానికి లోనవుతా. అలాంటప్పుడు ఏం చెప్పాలో కూడా మాటలు రావు. తొలి టెస్టులో విజయం సాధించాక రోహిత్‌ మీడియా సమావేశానికి వెళ్లి నన్నెంతగానో ప్రశంసించాడు. ఈరోజు ఉదయం వరకు అతడి మాటలకు ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఈరోజు అల్పాహారం చేస్తుండగా నువ్వెంతో మంచి మనసున్న వాడివని చెప్పా’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. అలాగే కపిల్‌దేవ్‌ రికార్డును బద్దలుకొట్టడంతో ఆ దిగ్గజం ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పాడు. తన ఇంటికి మాజీ సారథి బొకే పంపించి కంగ్రాట్స్‌ చెబుతూ ఒక సందేశం పంపాడన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు