Ravindra Jadeja: ఇద్దరు మహేంద్రుల మధ్యే నా క్రికెట్‌ ప్రయాణం: జడేజా

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చెన్నై సూపర్ కింగ్స్‌లో (CSK) కీలక ఆటగాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తాడు. తన క్రికెట్‌ ప్రయాణంపై తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 22 Apr 2023 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా టాప్ ఆల్‌రౌండర్, సీఎస్‌కే (CSK) కీలక ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి టాప్‌ సీక్రెట్ తెలిసిపోయింది. అయితే, దానిని బయటపెట్టింది కూడా జడ్డూనే. ఇంతకీ ఏంటా రహస్యం తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

ఐపీఎల్ 16వ సీజన్‌ సందర్భంగా పలు కీలక విషయాలను జడేజా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ క్రీడా ఛానల్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘‘నేను యువకుడిగా ఉన్నప్పుడు ఫాస్ట్‌బౌలర్‌ కావాలని భావించా. అయితే, నా కోచ్‌ మాత్రం ‘నువ్వు పేస్‌ బౌలింగ్‌ వేసేంత ఎత్తు లేవు. ఫాస్ట్‌ బౌలర్‌గా మారడం కష్టం’ అని చెప్పాడు. మా అకాడమీలో టర్ఫ్ వికెట్ ఉండేది. దీంతో అక్కడ బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టంగా అనిపించేది. బ్యాటింగ్‌ చేయాలని ఎవరికైనా అనిపిస్తే పిచ్‌ను వారే రోల్‌ చేయాలి. అలా చేయలేక నేను బౌలింగ్‌ వేసేవాడిని. ఫాస్ట్‌ బౌలింగ్‌ కాకుండా స్పిన్‌ను వేశాను. బ్యాటర్లను త్వరగా ఔట్‌ చేయడంతో ఆసక్తి పెరిగింది.  ఇప్పుడు గత క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్ చేయడం లేదు. ఇప్పుడక్కడ 300 నుంచి 400 మంది చిన్నారులు ఉన్నారు.  ఇక నా క్రికెట్‌ ప్రయాణం ఇద్దరితో  కొనసాగుతోంది. క్రికెటర్‌గా నా కోచ్‌ మహేంద్ర సింగ్‌ చౌహాన్‌ మార్గదర్శకంలో ప్రారంభించా. ఇప్పుడు ఎంఎస్ ధోనీతో కొనసాగిస్తున్నా.  ఇద్దరు మహేంద్ర సింగ్‌ల మధ్యే నా క్రికెట్‌ జీవితం ఉంది’’ అని జడేజా తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని