Ravindra Jadeja: భారత భవిష్యత్ స్టార్‌తో ఇలా..: రవీంద్ర జడేజా
ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం (IND vs AUS) భారత్ సన్నద్ధమవుతోంది. టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఇన్‌స్గాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగు పెట్టేందుకు టీమ్‌ఇండియా టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మోకాలికి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొన్న జడేజా.. ఫిట్‌నెస్ కూడా సాధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ జడేజా ఆడలేదు. కానీ, సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన జడేజా తన మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకొన్నట్లే ఉన్నాడు. ఏడు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు.
ఇప్పుడు ఆసీస్‌తో టెస్టు సిరీస్‌తో జడేజా జాతీయ జట్టులోకి పునరాగమనం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మతో కలిసి దిగిన ఫొటోను జడ్డూ షేర్ చేశాడు. ‘‘టీమ్‌ఇండియా భవిష్యత్తు తారతో ఇలా’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
Education News
MBBS results: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!