Ravindra Jadeja : తొమ్మిది పడగొడితే.. జడేజా ఖాతాలోకి మరో ఘనత
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న..
మూడో టీమ్ఇండియా బౌలర్‌గా మారే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా మరో మైలురాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం నుంచి శ్రీలంకతో గులాబీ బంతి టెస్టు జరగనుంది. తొలి టెస్టులో జడేజా 175 పరుగులు, తొమ్మిది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో మరో 9 వికెట్లను పడగొడితే టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా సాధించిన మూడో టీమ్ఇండియా బౌలర్‌గా నిలుస్తాడు. జడేజా కంటే ముందు అశ్విన్ (42), అనిల్ కుంబ్లే (55) మాత్రమే తక్కువ మ్యాచుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతం జడేజా 58 టెస్టుల్లో 241 వికెట్లతో కొనసాగుతున్నాడు. అదే విధంగా అక్షర్ పటేల్ (94) ‘వంద’ క్లబ్లో చేరేందుకు ఆరు వికెట్ల దూరంలోనే ఉన్నాడు.
అక్షర్ ఆ ఘనత అందుకునేనా.?
మరోవైపు, టీమ్ఇండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. రేపటి నుంచి (మార్చి 12) శ్రీలంకతో జరుగనున్న రెండో టెస్టు మ్యాచులో అక్షర్ 14 వికెట్లు పడగొడితే.. 133 ఏళ్ల క్రితం నాటి రికార్డు సమం కానుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఛార్లెస్ టర్నర్ 1880లో.. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడు కేవలం 6 టెస్టుల్లోనే 50 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన అక్షర్ 36 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరుగనున్న పింక్ బాల్ టెస్టులో ఒకవేళ అక్షర్ 14 వికెట్లు పడగొడితే.. ఛార్లెస్ రికార్డును సమం చేయనున్నాడు.
జడ్డూలా షహీన్ బౌలింగ్.. వీడియో వైరల్
పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది కాసేపు టీమ్ఇండియా బౌలర్ రవీంద్ర జడేజా మాదిరిగా మారిపోయాడు. ప్రస్తుతం పాక్‌లో ఆసీస్ పర్యటన కొనసాగుతోంది. రేపటి నుంచి కరాచీ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో షహీన్ సరదాగా బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ చేశాడు. అది కూడానూ అచ్చం రవీంద్ర జడేజా బౌలింగ్ స్టైల్‌తో ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘భలేగా కాపీ చేశాడు’’ .. ‘‘వందశాతం జడేజా యాక్షన్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్‌లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
కోల్‌కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్