Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్‌ ఫీల్డర్‌ అతడే: జాంటీ రోడ్స్‌

క్రికెట్‌లో ఓ జట్టులో విజయం బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎంత కీలకమో ఫీల్డింగ్‌ కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్‌ (Jonty Rhodes) ప్రస్తుతం ఉన్న బెస్ట్‌ ఫీల్డర్‌ ఎవరో బయటపెట్టాడు.

Published : 30 Mar 2023 20:05 IST

ఇంటర్నెట్ డెస్క్: జాంటీ రోడ్స్‌ (Jonty Rhodes).క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు.  ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం బ్యాటింగ్‌, బౌలింగే కాదు.. మెరుపు ఫీల్డింగ్‌తో కూడా అభిమానుల మనసు దోచుకున్నారు. జాంటీ రోడ్స్‌ తర్వాత ఎంతో మంది ఆటగాళ్లు తమ ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నా అతడికి సాటిరారు. ఐపీఎల్‌-16 (IPL) సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్న ఆయన.. ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్‌ ఫీల్డర్‌ ఎవరనే అంశంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్‌ అని జాంటీరోడ్స్‌‌ కితాబిచ్చారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాంటీరోడ్స్‌ను ప్రస్తుతం ప్రపంచంలో ముగ్గురు అత్యుత్తమ ఫీల్డర్లను ఎంచుకోవాలని కోరగా.. ఒకే ఒక్కరు ఉన్నారని రవీంద్ర జడేజా పేరును చెప్పారు. ఐపీఎల్‌ వల్ల ఫీల్డింగ్‌ ప్రమాణాలు పెరిగాయని, ఈ లీగ్‌ ప్రారంభం అయిన తర్వాతే ఫీల్డింగ్‌పై అందరి ఫోకస్‌ పెరిగిందన్నారు. ఇక, రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ విన్యాసాల గురించి ఎంత చెప్పిన తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో అతడు ఎన్నో మ్యాచ్‌ల్లో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్‌ చేసిన మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసరడంలో జడేజా దిట్ట. ఐపీఎల్‌ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు ఆడుతున్న విషయం తెలిసిందే. మార్చి 31న గుజరాత్‌, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌-16 సీజన్‌ ప్రారంభంకానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని