Ravindra Jadeja: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో జడేజా

2023 ఫిబ్రవరి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డుకు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నామినేట్‌ అయ్యాడు. 

Published : 07 Mar 2023 19:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిబ్రవరి 2023 పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డులకు నామినేట్ చేసిన అత్యుత్తమ క్రికెటర్ల పేర్లను  ఐసీసీ (ICC) ప్రకటించింది. బోర్డర్‌ -గావస్కర్‌ ట్రోఫీలో అదరగొడుతున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కింది. టెస్టు క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఇంగ్లాండ్ యువ బ్యాటర్‌ హ్యరీ బ్రూక్‌ (Harry Brook)తోపాటు వెస్టిండీస్‌ స్పిన్నర్‌ గుడాకేష్ మోటి (Gudakesh Motie) ఫిబ్రవరి నెలకుగాను ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్ అయ్యారు. 

ఐదు నెలల విరామం తర్వాత పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మూడు టెస్టుల్లో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 70 పరుగులతో మెరిశాడు. హ్యరీ బ్రూక్‌ ఆడిన ఆరు టెస్టుల్లోనే 800కుపైగా పరుగులు చేసి చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 2022 డిసెంబర్‌ నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డును అందుకున్నాడు. అటు వెస్టిండీస్ బౌలర్ గుడాకేష్‌ మోటి కూడా జింబాబ్వేపై రెండు టెస్టుల సిరీస్‌లో తన స్పిన్‌ మాయాజాలంతో అదగొట్టాడు. రెండు టెస్టుల్లో కలిపి 19 వికెట్లు తీసుకున్నాడు. రెండో టెస్టులో ఏకంగా 13 వికెట్లు తీయడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ స్పిన్నర్ కు ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని