Ravindra Jadeja : జడేజా ట్వీట్.. ఉత్సాహంలో చెన్నై అభిమానులు

Ravindra Jadeja: చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులనుద్దేశించి ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చేసిన రెండు పదాల ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో చెన్నై అభిమానులు అతడిపై ప్రేమను కురిపిస్తున్నారు.

Updated : 23 Jan 2023 11:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మోకాలి గాయం కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు జాతీయ జట్టు(Team India)లోకి ఎప్పుడు వస్తాడా.. అని అతడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) యాజమాన్యంతో జడ్డూకు విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చెన్నై అభిమానులనుద్దేశించి అతడు చేసిన ఓ ట్వీట్‌  ఇప్పుడు వైరల్‌గా మారింది.

రంజీ ట్రోఫీ ఫైనల్‌ లీగ్‌ కోసం చెన్నై వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌ ‘వణక్కం చెన్నై’ అంటూ చేసిన ట్వీట్‌ అక్కడి అభిమానులను ఉత్సాహపరిచింది. దీంతో ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ సూపర్‌ కింగ్‌..’, ‘మా అభిమాన ఆటగాడికి చెన్నై నగరం స్వాగతం పలుకుతోంది’ అంటూ అభిమానులు తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మోకాలి గాయానికి చికిత్స అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరి తన ఆటను మెరుగుపరుచుకున్న జడేజా.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమ్‌ఇండియాకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై నిరాశ పరిచింది. తొలుత జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. వరుస ఓటముల నేపథ్యంలో తిరిగి ధోనీకే ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని