Updated : 14 Sep 2021 03:18 IST

IPL 2021: దుబాయి చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు కోహ్లీ, సిరాజ్.!

దుబాయి : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మరో ఆటగాడు మహమ్మద్‌ సిరాజ్‌ ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో దుబాయి చేరుకున్నారు. ఆర్‌సీబీ యాజమాన్యం వీరికి ఘనంగా స్వాగతం పలికింది. ఆరు రోజుల క్వారంటెయిన్‌ తర్వాత వీరిద్దరూ జట్టులో చేరనున్నారు. ‘కొత్తగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో గొప్ప నైపుణ్యాలున్నాయి. వారందరినీ జట్టులో చూడటం చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌ మిగతా సీజన్‌ని ఘనంగా ప్రారంభిస్తాం’ అని ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఇటీవల ఆర్‌సీబీ యాజమాన్యం జట్టులో పలు మార్పులు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్‌ జంపా స్థానంలో శ్రీలంకకు చెందిన హసరంగ, డేనియల్‌ సామ్స్‌ స్థానంలో దుష్మంత చమీర,  కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానంలో జార్జ్‌ గార్టన్‌, ఫిన్‌ ఆలెన్‌ స్థానంలో టిమ్‌ డేవిడ్‌లను కొత్తగా జట్టులోకి తీసుకుంది.

‘చాలా రోజుల తర్వాత ఆర్‌సీబీ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉంది. పాయింట్ల పట్టికలో మేం మెరుగైన స్థానంలో ఉన్నాం. ఐపీఎల్‌ ప్రారంభం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను’ అని ఆర్‌సీబీ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తెలిపాడు. కరోనా కారణంగా ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా, మిగతా సీజన్‌ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. మలిదశ తొలి మ్యాచులో డిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని