IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బెంగళూరు

ఐపీఎల్ మలిదశలో భాగంగా.. దుబాయి వేదికగా మరి కొద్దిసేపట్లో రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్‌..

Updated : 29 Sep 2021 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్ మలిదశలో భాగంగా.. దుబాయి వేదికగా మరి కొద్దిసేపట్లో రాజస్థాన్‌ రాయల్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. ఆరు విజయాలతో కొనసాగుతున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచులో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, చివరి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన రాజస్థాన్‌ రాయల్స్ ప్లే ఆఫ్స్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది. 

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు: ఎవిన్‌ లూయిస్‌, యశస్వీ జైస్వాల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మహిపాల్‌ లోమ్రోర్, రియాన్ పరాగ్‌, రాహుల్‌ తెవాటియా, క్రిస్‌ మోరిస్, కార్తిక్ త్యాగి, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, శ్రీకర్‌ భరత్‌ (వికెట్ కీపర్‌), గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఏబీ డి విలియర్స్‌, డేనియల్‌ క్రిస్టియన్‌, జార్జ్‌ గార్టన్‌, షాబాజ్‌ అహ్మద్‌, హర్షల్‌ పటేల్, మహమ్మద్‌ సిరాజ్‌, యుజువేంద్ర చాహల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని