KL Rahul: వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా: కేఎల్ రాహుల్

త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు తనను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని కేఎల్ రాహుల్‌ అన్నాడు. అలాగే, టీమిండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్‌తో..

Published : 16 Nov 2021 01:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు తనను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని కేఎల్ రాహుల్‌ అన్నాడు. అలాగే, టీమిండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్‌తో కలిసి పని చేసేందుకు తానెంతగానో ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. 

‘న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నా. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లంతా కలివిడిగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాను. రాహుల్ ద్రావిడ్‌ ఎంత గొప్ప క్రికెటరో మనందరికీ తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను కర్ణాటక తరఫున ఆడుతున్నప్పటి నుంచి రాహుల్ సర్‌ని అనుకరించేందుకు ప్రయత్నించేవాడిని. ఆయన ఎంతో మంది యువ క్రికెటర్లను టీమిండియాకు అందించారు. మైదానంలో ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఆడేలా చూస్తారు. ఆయనెప్పుడూ జట్టులో ఓ సభ్యుడిలా అందరితో కలిసి మెలిసి ఉంటారు. అందుకే, ఆయనతో కలిసి పని చేసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు