భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో...

Published : 20 Jan 2021 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2-1 తేడాతో ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి సిరీస్‌ కైవసం చేసుకుంది. 2018-19లోనూ భారత్‌ 2-1 తేడాతోనే కంగారూలపై సిరీస్‌ కైవసం చేసుకొని తొలిసారి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. అనంతరం కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 33 కలుపుకొని భారత్‌ ముందు 327 లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఐదోరోజు 4/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్ కొనసాగించి చివరి క్షణాల్లో విజయం సాధించింది. పంత్‌(89*) కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు విజయాన్ని చేకూర్చాడు. దీంతో భారత్‌ కంగారూ గడ్డపై రెండోసారి చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెట్‌లో పలు రికార్డులు, విశేషాలు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దామా..

టెస్టుల్లో చివరి రోజు అత్యధిక పరుగులు చేసిన సందర్భాలు..

* 1948 లీడ్స్‌ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్‌)

* 1984 లార్డ్స్‌ ‌: 344 (వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

* 2020/21 బ్రిస్బేన్ : 325(భారత్‌ vs ఆస్ట్రేలియా)

* 1977/78 పెర్త్‌:  317(ఆస్ట్రేలియా vs భారత్‌)

*‌ 2017 లీడ్స్‌: 317(వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

 

తొలి టెస్టు ఓడాక భారత్‌ సిరీస్‌ గెలిచిన సందర్భాలు..

* 1972/73 సీజన్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలుపు

* 2000/01 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు

* 2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం

* 2016/17 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం

* 2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు

 

ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన..

* 2008/09 : పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన

* 1928/29 : మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 332 పరుగుల ఛేదన

* 2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ 329 పరుగుల ఛేదన

 

టెస్టుల్లో టీమ్‌ఇండియా అత్యధిక లక్ష్య ఛేదనలు..

* 1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగుల ఛేదన

* 2008/09 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల ఛేదన

* 2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన

* 2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగుల ఛేదన

* 2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన

 

ఒకే వేదికపై ఓటమి లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన జట్లు

* 1955-2000 వరకు కరాచి స్టేడియంలో పాకిస్థాన్‌ 34 మ్యాచ్‌లు ఆడింది

* 1989-2019 వరకు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా 31 మ్యాచ్‌లు ఆడింది.

* 1948-1993 వరకు కెన్‌సింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో వెస్టిండీస్‌ 27 మ్యాచ్‌లు ఆడింది

* 1905-1954 వరకు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో ఇంగ్లాండ్‌ 25 మ్యాచ్‌లు ఆడింది

* 1958-1989 వరకు సెబీనా పార్క్‌లో వెస్టిండీస్‌ 19 మ్యాచ్‌లు ఆడింది.

ఇవీ చదవండి..

ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు.. 

భారత్‌ చిరస్మరణీయ విజయం..

భారత్‌ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని