IND vs BAN: మహమ్మద్ షమీ స్థానంలో 12 ఏళ్ల తర్వాత సీనియర్‌ బౌలర్‌కు పిలుపు

దాదాపు 12 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి సీనియర్ బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కత్‌కు పిలుపు రావడం విశేషం. ఇప్పటి వరకు అతడు ఆడింది ఏకైక టెస్టు మ్యాచ్‌. దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి బంగ్లాతో టెస్టులకు అవకాశం వచ్చింది.

Published : 10 Dec 2022 14:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చాన్నాళ్ల తర్వాత సీనియర్ బౌలర్‌ జయ్‌దేవ్ ఉనద్కత్‌కు భారత జట్టులోకి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో జయ్‌దేవ్‌ను తీసుకొన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చేతికి గాయం కారణంగా షమీ సిరీస్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

2010లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన 31 ఏళ్ల జయ్‌దేవ్‌.. ఆ ఏడాది కేవలం ఒక టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కటీ ఆడలేదు. అయితే  ఏడు వన్డేలు, 10 టీ20ల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ జట్టులోకి వచ్చాడు. 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. అయితే వీసా ప్రక్రియ ముగియగానే చిట్టగాంగ్‌లో టీమ్‌తో కలుస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని