IND vs AUS: సూర్య ఇలా ఔట్‌ కావడం మొదటిసారి.. టీ20 బ్యాటర్లలో అతడే అత్యుత్తమం: ఆసీస్‌ పేసర్

టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఈ మాట అన్నది ఆసీస్ ఫాస్ట్‌ బౌలర్. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరుగుతోంది. సూర్యకుమార్‌ అర్ధశతకం సాధించి సత్తా చాటాడు.

Published : 17 Oct 2022 16:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వార్మప్‌ మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ (50) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆసీస్‌ బౌలర్‌ రిచర్డ్‌సన్‌ నాలుగు వికెట్ల పడగొట్టాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక.. రిచర్డ్‌సన్‌ మాట్లాడుతూ సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత టీ20 బ్యాటర్లలో సూర్యకుమార్‌ ఉత్తమ ఆటగాడని కొనియాడాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి అతడికి క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ పెవిలియన్‌కు చేరాడు. 

‘‘సూర్యకుమార్‌ యాదవ్‌ మా జట్టుపై తొలిసారి బ్యాట్‌కు బంతి మిడిల్‌ కాకుండా ఔట్ కావడం ఇదే మొదటిసారని అనుకొంటున్నా. ఇప్పుడున్న టీ20 బ్యాటర్లలో సూర్యకుమార్‌ అత్యుత్తమం. అలాంటి ఆటగాడి వికెట్‌ను తీయడం బాగుంది. ఇక నా బౌలింగ్‌కు వస్తే.. ఇలాగే ప్రారంభించాలని ఏమీ అనుకోలేదు. ఫామ్‌తో ఉంటే ఒకలా.. గాయడిపతే మరోలా జరగడం సహజం. అయితే ఇవాళ మంచిగా బౌలింగ్‌ చేయడం సంతోషంగా ఉంది. మధ్య ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా వేశారు. అయితే వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకులతో లేని స్టేడియాల్లో ఆడాల్సి వస్తోంది. ఇదొక్కటే కాస్త నిరుత్సాహ పరించింది. అయితే సిసలైన పోరులో మాత్రం భారత్‌తో మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు ఉంటారని భావిస్తున్నా’’ అని రిచర్డ్‌సన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని