Ricky Ponting : కోలుకున్న పాంటింగ్.. తిరిగి కామెంట్రీ విధుల్లోకి..
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ అస్వస్థతకు గురై తిరిగి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. శనివారం ఎంతో ఉత్సాహంగా కామెంట్రీ ప్రారంభించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురై తిరిగి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. శనివారం ఉదయం తిరిగి ఎంతో ఉత్సాహంగా కామెంట్రీ విధుల్లోకి వచ్చానని పాంటింగ్ స్వయంగా వెల్లడించడం విశేషం.
‘బహుశా నేను నిన్న చాలా మందిని భయపెట్టి ఉంటాను. నిజం చెప్పాలంటే.. నాకు కూడా అది భయంకరమైన క్షణమే. అయితే, ఈ ఉదయం నాకెంతో గొప్పది. షైనీ అండ్ న్యూ’ అంటూ పాంటింగ్ కామెంట్రీ ప్రారంభించినట్లు ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఈ వార్తతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు ఛానెల్ 7 తరఫున పాంటింగ్ కామెంటటేర్గా ఉన్నాడు. ఈ మ్యాచ్కు 40 నిమిషాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 47 ఏళ్ల పాంటింగ్.. ఛాతిలో నొప్పి కారణంగా కామెంట్రీ బాక్స్ నుంచి వేగంగా బయటకు వచ్చాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకోవడంతో తిరిగి కామెంట్రీ విధుల్లో చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్