Published : 07 Mar 2022 01:15 IST

Shane warne: ‘వార్న్‌ నా జీవితంలో భాగం’.. సహచరుడిని తలచుకొని రికీ కంటతడి

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ మరణవార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. తాను ఆడిన బౌలర్లలో మేటి ఆటగాడు షేన్‌వార్న్‌ అని పేర్కొన్నాడు. వార్న్‌ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు.

‘‘వార్న్‌ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. నాకు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకాడమీలో తొలిసారి కలిశా. అప్పుడే నాకో నిక్‌నేమ్‌ పెట్టాడు. మేమిద్దరం కలిసి దాదాపు దశాబ్దం పాటు జట్టుతో పాటు ప్రయాణించాం. ఫ్యామిలీని వార్న్‌ అమితంగా ప్రేమించే వాడు. వార్న్‌పై నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది. వార్న్ లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నా జీవితంలో వార్న్‌ భాగమైపోయాడు’’ అంటూ రికీ ఆవేదన వ్యక్తం చేశాడు.

షేన్‌వార్న్‌ 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టగా.. అక్కడికి మూడేళ్ల తర్వాత రికీ పాంటింగ్ జాతీయ జట్టులోకి వచ్చాడు. బౌలింగ్‌లో వార్న్‌ దిగ్గజంగా ఎలా మారాడో.. బ్యాటింగ్‌లో పాంటింగ్‌ అదే తరహాలో ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. వార్న్‌ వైస్‌ కెప్టెన్‌ స్థాయి వరకు ఎదిగినా కెప్టెన్‌ కాలేకపోయాడు. రికీ పాంటింగ్‌ కెప్టెన్‌గా వ్యవరించాడు. రికీ నాయకత్వంలోనే షేన్‌ వార్న్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని