Rishabh Pant: ఉత్తరాఖండ్‌ బ్రాండ్‌ అంబాసడర్‌గా రిషభ్‌ పంత్‌

టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యం గురించి యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అతడిని బ్రాండ్‌..

Published : 21 Dec 2021 01:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యం గురించి యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అతడిని బ్రాండ్‌ అంబాసడర్‌గా నియమించింది. 24 ఏళ్ల రిషభ్‌ పంత్‌ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా రూర్కీలో జన్మించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు. యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుని, ఉత్తరాఖండ్‌ని సందర్శించాలని కోరారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్‌ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హిందీలో ఓ ట్వీట్ చేశారు. ‘భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. దేశ యువతకు ఆదర్శవంతుడు. ఉత్తరాఖండ్‌ స్థానికుడు శ్రీ రిషభ్‌ పంత్‌ను.. యువతని క్రీడారంగంలో ప్రోత్సహించడానికి, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమిస్తున్నాం’ అని పుష్కర్‌ సింగ్ ధామి ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రిషభ్‌ పంత్‌.. ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇంత గొప్ప అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామికి ధన్యవాదాలు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్‌గా.. క్రీడలు, మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తాను. ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తాను’ అని పంత్‌ ట్వీట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని