Rishabh Pant: ఐసోలేషన్‌ పూర్తిచేసుకున్న పంత్‌

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పది రోజుల ఐసోలేషన్‌ గడువు పూర్తిచేసుకున్నాడు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన అతడు లండన్‌లోని ఓ చోట ప్రత్యేకంగా ఐసోలేషన్‌లోకి...

Published : 20 Jul 2021 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పది రోజుల ఐసోలేషన్‌ గడువు పూర్తిచేసుకున్నాడు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన అతడు లండన్‌లోని ఓ చోట ప్రత్యేకంగా ఐసోలేషన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడా గడువు పూర్తిచేసుకొని క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే, టీమ్‌ఇండియా మంగళవారం నుంచి కౌంటీ XI జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా, పంత్‌ ఐసోలేషన్ పూర్తి చేసుకున్నా ఈ మూడు రోజుల ఆటలో పాల్గొనడంలేదని ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో అన్నారు.

‘ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం పంత్‌.. డర్హమ్‌కు ఆట ప్రారంభమయ్యే సమయానికి చేరుకున్నా టీమ్ఇండియా ఆడనివ్వదు. అతడు పూర్తి ఆరోగ్యంగా తయారవ్వడానికి సహకరిస్తుంది. అతడికి తగిన విశ్రాంతి ఇస్తుంది. పంత్‌కు ఇప్పుడు కరోనా లక్షణాలు లేకపోయినా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాలి. అయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొలి టెస్టుకు ముందు పంత్‌, వృద్ధిమాన్‌ సాహా జట్టుకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ వాళ్లిద్దరూ ఆడకపోయినా కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా, గతనెల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలయ్యాక జట్టు యాజమాన్యం మూడు వారాలు విశ్రాంతినిచ్చింది. ఈ సమయంలోనే పంత్‌, నెట్‌బౌలర్‌ దయానంద్‌ గరానీ వైరస్‌బారిన పడ్డారు. అదే సమయంలో సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వారి దగ్గరికి వెళ్లడంతో ముందు జాగ్రత్త చర్యగా వారిని కూడా ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, వీరి సమయం ఇంకా పూర్తికాలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని