Rishabh Pant: రిషభ్‌ పంత్‌కు కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్‌ నటి..

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టి డిలీట్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఒక బాలీవుడ్‌ నటిని ఉద్దేశించే ఆ స్టోరీ పెట్టి తొలగించాడని నెటిజన్లు అంటున్నారు...

Published : 13 Aug 2022 01:25 IST

(Photos: Rishabh Pant and Urvashi Rautela Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టి డిలీట్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఒక బాలీవుడ్‌ నటిని ఉద్దేశించే ఆ స్టోరీ పెట్టి తొలగించాడని నెటిజన్లు అంటున్నారు. పది నిమిషాల్లోనే పంత్‌ ఆ స్టోరీని తొలగించినా.. అప్పటికే అది వైరల్‌గా మారింది. దీనిపై సదరు నటి కూడా ఘాటుగానే స్పందించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మిస్టర్‌ ఆర్పీ’ అనే వ్యక్తి గతంలో తనని కలవడానికి చాలా కాలం ఎదురు చూశాడని చెప్పింది. ‘నేను ఒకసారి వారణాసిలో షూటింగ్ ముగించుకొని దిల్లీ చేరుకున్నాను. అక్కడ కూడా షూటింగ్‌ పూర్తయ్యాక రాత్రికి హోటల్‌కు చేరుకున్నా. అప్పటికే ఆర్పీ అనే వ్యక్తి నన్ను కలవడం కోసం హోటల్‌ లాంజ్‌లో ఎదురుచూస్తున్నాడు. నేను అలసిపోవడంతో గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకున్నా. నిద్రలేచేసరికి 16-17 మిస్‌డ్‌ కాల్స్‌ ఉండటంతో బాధపడ్డా. నాకోసం ఒకరు ఎదురుచూస్తున్నా కలవలేకపోయానని అనుకున్నా. తర్వాత కలుద్దాం అని చెప్పాను. ముంబయిలో అతడిని కలిశాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ విషయంపై తాజాగా స్పందించిన పంత్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘కొందరు వ్యక్తులు ఇంటర్వ్యూల్లో పాపులారిటీ తెచ్చుకోవడం కోసం అలా ఎలా అబద్ధాలు  ఆడతారు? ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్లు ఫేమస్‌ అయ్యేందుకు ఇలా ప్రవర్తించడం బాధాకరం. అలాంటి వాళ్లను దేవుడు దీవించుగాక’ అని పోస్టు చేసి కాసేపట్లోనే డిలీట్‌ చేశాడు. అయితే, దీనిపై ఉర్వశి సైతం ఘాటుగా స్పందించి కౌంటర్‌ వేసింది. తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెడుతూ.. ‘చోటు భయ్యా నువ్వు క్రికెట్‌ ఆడుకోవాలి. నేనేం చిన్న పిల్లని కాదు.. బద్నాం చేయడానికి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని