rishabh pant: డ్రెస్సింగ్ రూంలో పంత్‌ పుట్టినరోజు వేడుకలు

మంగళవారం మ్యాచ్‌ అనంతరం రిషభ్‌ పంత్‌ పుట్టిన రోజును టీమ్ అంతా కలిసి వేడుకగా జరిపారు. అందుకు వీరి డ్రెస్సింగ్ రూం వేదికైంది. 

Published : 06 Oct 2022 02:01 IST

దిల్లీ:  దక్షిణాఫ్రికాతో చివరి టీ20లో ఓటమిపాలైన టీమ్ఇండియా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16న జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీపై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌ గెలిచేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిన ఆటగాళ్లు ఆసీస్‌ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం మ్యాచ్‌ అనంతరం రిషభ్‌ పంత్‌ పుట్టిన రోజును టీమ్ అంతా కలిసి వేడుకగా జరిపారు. అందుకు వీరి డ్రెస్సింగ్ రూం వేదికైంది. 

ఇందుకు సంబంధించిన ఫొటోలను పంత్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘‘నిన్నటి రోజు చాలా సంతోషంగా గడిచింది. నాకు శుభాకాంక్షలు తెలిపేందుకు సమయం కేటాయించిన నా స్నేహితులు, జట్టు సభ్యులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నాకెంతో విలువైంది. నేను చాలా కృతజ్ఞుడిని’’అంటూ పోస్ట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌పై భారత్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు దక్షిణాఫ్రికాతో టీ20లో మాత్రం ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పంత్‌ టెస్టు మ్యాచుల్లో అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత జట్టులో స్థానం సంపాదించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని