Rishabh Pant : డీ2హెచ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా రిషభ్‌ పంత్‌

టీమిండియా యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. డిష్‌ టీవీకి చెందిన డైరెక్ట్‌ బ్రాడ్‌కాస్ట్‌ శాటిలైట్‌  సర్వీస్‌ ప్రొవైడర్‌ డీ2హెచ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. వచ్చే రెండు సంవత్సరాల పాటు..

Published : 24 Feb 2022 20:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమిండియా యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. డిష్‌ టీవీకి చెందిన డైరెక్ట్‌ బ్రాడ్‌కాస్ట్‌ శాటిలైట్‌  సర్వీస్‌ ప్రొవైడర్‌ డీ2హెచ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. వచ్చే రెండు సంవత్సరాల పాటు అతడు ఈ సంస్థతో కలిసి పని చేయనున్నాడు.

డిష్‌ టీవీ తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై రిషభ్‌ పంత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో డీ2హెచ్‌ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అలాంటి సంస్థతో కలిసి పని చేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. డిష్ టీవీ టీమ్‌తో కలిసి సంస్థను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నాను’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.

‘మా డీ2హెచ్‌ బ్రాండ్‌కు రిషభ్‌ పంత్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బ్రాండే మాకున్న అతిపెద్ద బలం. పంత్‌ నియామకంతో డీ2హెచ్‌ బ్రాండ్‌ విలువ మరింత పెరుగుతుంది’ అని డిష్ టీవీ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, గ్రూప్‌ సీఈవో అనిల్ దువా ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని