IND vs AUS: రిషభ్‌ పంత్‌ను తీసుకుంటారా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా నేడు ఆ ప్రతీకారం తీర్చుకుంటుందా? సిరీస్‌పై ఆశలు నిలవాలంటే

Published : 23 Sep 2022 10:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా నేడు ఆ ప్రతీకారం తీర్చుకుంటుందా? సిరీస్‌పై ఆశలు నిలవాలంటే నేడు జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి..! మరి ఈ మ్యాచ్‌కు జట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌కు అవకాశం కల్పిస్తారా?

ఆసీస్‌తో తొలి టీ20లో దినేశ్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నా ఆకట్టుకోలేకపోయాడు. కీపింగ్‌లో పెద్దగా మాయ చేయని కార్తీక్‌.. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులకే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండో టీ20లో అతడి స్థానంలో పంత్‌ను తీసుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక, గత మ్యాచ్‌లో బౌలింగ్‌ వైఫల్యం ప్రధానంగా కన్పించింది. ముఖ్యంగా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో అతడిని పక్కన పెట్టాలనే అభిప్రాయాలున్నాయి. ఇటీవలే ఫిట్‌నెస్‌ సాధించిన బుమ్రా తిరిగి జట్టులోకి రావొచ్చు. ఈ విషయాన్ని రోహిత్‌ కూడా సూచనప్రాయంగా చెప్పాడు. అయితే బుమ్రాను ఉమేశ్‌ స్థానంలో తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి మినహా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు.

సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌కు కళ్లెం వేయాలంటే టీమిండియా లోపాలన్నీ సరిదిద్దుకుని ఉత్తమ ప్రదర్శన చేయాల్సింది. నేటి మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు.

భారత జట్టు అంచనా..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, యుజువేంద్ర చాహల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు