Rishabh pant: మెరుగవుతోన్న పంత్‌ ఆరోగ్యం.. ప్రైవేటు వార్డుకు షిఫ్ట్‌

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ఆరోగ్య పరిస్థితిపై దిల్లీ క్రికెట్‌ బోర్డు (DDCA) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

Updated : 02 Jan 2023 13:42 IST

దిల్లీ: టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(Rishabh pant) రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెటర్లు, అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తాజాగా పంత్‌ ఆరోగ్యంపై దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌(DDCA) డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ స్పందించాడు. పంత్‌ కోలుకుంటున్నాడని తెలిపాడు. ‘‘పంత్‌ ఆరోగ్యం మెరుగవుతోంది. ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిన్న సాయంత్రం అతడిని ప్రైవేటు వార్డుకు మార్చారు. మరింత కోలుకునే వరకు దెహ్రాదూన్‌ అసుపత్రిలోనే చికిత్స ఉంటుంది. ఇప్పటికే నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్‌ సర్జరీని వైద్యులు చేశారు. కాలి లెగ్మెంట్‌ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది’’ అని తెలిపాడు. 

ఇషాన్‌ షాక్..

మరోవైపు అభిమానుల ద్వారా ప్రమాద వార్తను తెలుసుకున్న సహచర ఆటగాడు ఇషాన్‌ కిషన్‌(Ishan kishan)ను ఈ వార్త షాక్‌కు గురిచేసింది. ఆ సమయంలో ఇషాన్‌ రంజీ ట్రోఫీ కోసం ఝార్ఖండ్‌లో ఉన్నాడు. సెల్ఫీలు ఇస్తున్నసమయంలో పంత్‌కు ఆక్సిడెంట్‌ అయ్యిందంటూ అభిమానులు తెలపడంతో ‘‘ఏంటీ?..’’ అంటూ నివ్వెరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డిసెంబర్‌ 30న దిల్లీ- దెహ్రాదూన్‌ జాతీయ రహదారిపై పంత్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని