Pant: పంత్ ఆరోగ్యంపై అప్‌డేట్.. అవసరమైతే యూకే పంపించే యోచనలో బీసీసీఐ!
టీమ్‌ఇండియా (Team India) యువ ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant)ను దెహ్రాదూన్ నుంచి ముంబయికి తరలించినట్లు దిల్లీ క్రికెట్ బోర్డు (DDCA) వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: గతవారంలో రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) దెహ్రాదూన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇంకా మెరుగైన వైద్యం కోసం అతడిని ముంబయికి తరలించారు. రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీ క్రికెట్ బోర్డు (DDCA) డైరెక్టర్ శ్యామ్ శర్మ తాజాగా వివరాలను వెల్లడించారు. ‘‘మెరుగైన వైద్యం కోసం క్రికెటర్ పంత్‌ను ముంబయికి తరలించారు’’ అని శర్మ తెలిపారు. బీసీసీఐ వైద్య బృందం సమక్షంలో కుడికాలు లిగ్మెంట్‌కు శస్త్రచికత్స నిర్వహిస్తారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే విదేశాలకు (యూకే) తరలించే అంశంపైనా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
గంగూలీ ప్రత్యేక సందేశం
రిషభ్‌పంత్ త్వరగా కోలుకొని తిరిగి తన ఆట కొనసాగించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆకాంక్షించాడు. ‘‘పంత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని ఎదుర్కొని నువ్వు ముందుకు సాగాలి. త్వరగా కోలుకొని తిరిగి అతడి మార్గంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను’’అని గంగూలీ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!