Aakash chopra: పంత్‌పై ట్రోలింగ్‌ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది: ఆకాశ్‌ చోప్రా

శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో రాణించలేకపోయిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌పై నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది.

Published : 25 Nov 2022 16:51 IST

ఆక్లాండ్‌: శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో రాణించలేకపోయిన రిషభ్‌ పంత్‌పై నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది. ఈ విషయంపై మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. పంత్‌పై వస్తోన్న విమర్శలు తనకు విస్మయం కలిగిస్తున్నాయన్నాడు. నంబర్‌ 4 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌(15)ను 33వ ఓవర్‌లో ఫెర్గూసన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అర్ధ సెంచరీలు చేసిన శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌గిల్‌ సైతం స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 

కివీస్‌తో టీ20 సిరీస్‌లోనూ ఈ వికెట్‌ కీపర్‌ కేవలం 17 పరుగులు చేసి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది టీ20లతో పాటుగా వన్డేల్లోనూ ఈ ఆటగాడి స్కోర్‌పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి ఓవర్‌లో 2 ఫోర్లు, 3 సిక్సులతో విజృంభించిన వాషింగ్టన్‌ సుందర్‌ వల్ల చివరి 5 ఓవర్లలో టీమ్‌ఇండియా 56 పరుగులు రాబట్టగలిగింది. ఈ ఆటగాడిపై ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ‘‘సుందర్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడు అర్ధ శతకాలకంటే సుందర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ చాలా ప్రభావవంతమైంది. లోయర్‌ ఆర్డర్‌లో ఆడే ఆటగాళ్లను వారి సగటు ఆధారంగా తక్కువ అంచనా వేయకూడదు. ఆటపై వారు ఏ మేరకు ప్రభావం చూపారనేదే ముఖ్యం’’ అంటూ అభినందించాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని