అందుకు పంతే కారణం

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ వల్లే అంపైర్‌ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్‌)లు వృథా అవుతున్నాయని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చమత్కరించాడు.

Published : 18 Mar 2021 09:18 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ వల్లే అంపైర్‌ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్‌)లు వృథా అవుతున్నాయని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చమత్కరించాడు. సమీక్షలు కోరే విషయంలో తాను మరింత మెరుగవ్వాలని తెలిపాడు. ‘‘సమీక్షల విషయంలో నన్ను చూసే దృష్టికోణం మారాలి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు నా సమీక్షలు బాగుండేవి. అయితే సమీక్ష కోరేటప్పుడు వికెట్‌ కీపర్‌ మీద ఆధారపడాల్సి ఉంటుంది. బంతి సరైన లైన్‌లో పడిందా? వికెట్లను తాకుతుందా? బౌలింగ్‌ కోణం, బౌన్స్‌ ఎలా ఉంది? అనే విషయాల్లో కీపర్‌ సాయం అవసరం. కాని చాలా సందర్భాల్లో పంత్‌ నన్ను నిరాశ పరిచాడు. దీంతో పంత్‌ను పక్కకు తీసుకెళ్లా. ఈ విషయంలో మనం కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పా. ఎందుకంటే సమీక్ష కోరే విషయంలో రవిశాస్త్రికి నా మీద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. నిజానికి ఈ విషయంలో నేను మరింత మెరుగ్గావాలి. భవిష్యత్తు సిరీస్‌లలో సమీక్షల్లో కచ్చితత్వం కోసం ప్రయత్నిస్తా’’ అని అశ్విన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని