Rishabh Pant: దేవుడి స్క్రిప్ట్‌ మరోలా ఉంది.. రిషభ్‌ పంత్‌ ఎమోషనల్ పోస్టు

ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత రిషబ్‌ పంత్‌ టీమ్‌ ఇండియాలో భాగమై..టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)లో మెరుపులు మెరిపించాడు.  

Updated : 03 Jul 2024 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన రిషభ్‌ పంత్ (Rishabh Pant).. జాతీయ జట్టు తరఫున ఘనంగా పునరాగమనం చేశాడు. ఈ టోర్నీలో బ్యాటర్‌గానే కాకుండా కీపింగ్‌లోనూ అద్భుతమైన మెరుపులతో అదరగొట్టాడు.

ఈ క్రమంలో విన్నింగ్‌ మెడల్‌తో ఉన్న ఫొటోలను అతడు తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసి, ఉద్వేగంగా పోస్టు పెట్టాడు. ‘‘ఎంతో గొప్పగా, గర్వంగా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడికి తన సొంత ప్లాన్‌ ఉంటుంది. ఈ మెడల్ ఎంతో విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చాడు. బ్యాటింగ్‌లో 8 మ్యాచులకుగాను 171 పరుగులు చేశాడు. ఫైనల్‌ మినహా.. మిగతా మ్యాచుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన పంత్‌.. విలువైన పరుగులు చేశాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్లలో ఎవరో ఒకరు త్వరగా పెవిలియన్‌కు చేరినప్పటికీ..  పంత్‌ వచ్చి దూకుడుగా ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని