Rishabh Pant : సూపర్‌ రిషభ్‌.. నువ్వొక ఎంటర్‌టైన్‌ క్రికెటర్‌వి

ఇంగ్లాండ్‌పై అద్భుతమైన శతకంతో చెలరేగిన రిషభ్‌ పంత్ (146) నెట్టింట్లో వైరల్‌గా మారాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ ఆపద్బాంధవుడి..

Updated : 02 Jul 2022 12:50 IST

ప్రశంసలు కురిపించిన క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌పై అద్భుతమైన శతకంతో చెలరేగిన రిషభ్‌ పంత్ (146) నెట్టింట్లో వైరల్‌గా మారాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా (83*)తో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగులను జోడించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 338/7 స్కోరు సాధించింది. రెండో రోజు ఆరంభంలో వికెట్‌ కోల్పోకుండా మరిన్ని పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రిషభ్‌ పంత్‌కు ప్రశంసలు దక్కాయి. సచిన్‌ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్‌ గంగూలీ, ఇయాన్ బిషప్, జై షా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆనంద్‌ మహింద్రా, వసీమ్‌ జాఫర్, ఇషా గుప్తా, రషీద్‌ ఖాన్‌ తదితరులు అభినందనలు తెలిపారు. 

ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశావు. ఇదొక స్పెషల్‌ ఇన్నింగ్స్‌ - సౌరభ్ గంగూలీ 

ప్రపంచంలోనే అత్యంత ఎంటర్‌టైన్‌మెంట్ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌నే. తనదైన శైలిలో సూపర్‌గా ఆడాడు - వీరేంద్ర సెహ్వాగ్ 

అత్యద్భుతం. వెల్‌డన్‌ రిషభ్‌ పంత్. జడేజా చాలా కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ ఇద్దరూ మంచి షాట్లు ఆడారు. - సచిన్‌ తెందూల్కర్‌ 

టెస్టు క్రికెట్‌లో తాండవం చేశాడు. రిషభ్‌ పంత్‌ స్పోర్ట్స్‌ ఆర్టిస్ట్‌. అతడిని చూసి ఆశ్చర్యపోకుండా ఉండటం అసాధ్యం - ఆనంద్ మహింద్రా


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని