MI-Rohit: ముంబయి కెప్టెన్‌గా రోహిత్ తొలగింపు.. సోషల్ మీడియాలో రితికా ఫస్ట్ రియాక్షన్ ఇదే

రోహిత్‌ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత అతని సతీమణి రితికా సజ్‌దేహ్‌ (Ritika Sajdeh) తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 

Published : 17 Dec 2023 01:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది. హిట్‌మ్యాన్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడంపై అతడి ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ శర్మ లేని ముంబయి ఇండియన్స్‌ ఊహించలేమని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)ను అన్‌ఫాలో చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ప్రకటన వచ్చిన తర్వాత అతని సతీమణి రితికా సజ్‌దేహ్‌ (Ritika Sajdeh) తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.  ‘‘2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు. రోహిత్‌.. మీ మీద  చాలా గౌరవం ఉంది’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ధోనీ-రోహిత్‌ ఫొటోను సీఎస్‌కే షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌లో రితికా ఎల్లో కలర్ హర్ట్ ఎమోజీని జోడించింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. రితికా చేసిన కామెంట్‌ను 60 వేలమందికిపైగా లైక్ చేశారు. ధోనీ సీఎస్కే మెంటార్‌గా మారి రోహిత్‌ను జట్టులోకి తీసుకుని కెప్టెన్‌ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.


వికెట్ కీపర్‌ నేనే.. రింకు అరంగేట్రం పక్కా: కేఎల్ రాహుల్ 

సౌతాఫ్రికా, భారత్ మధ్య డిసెంబరు 17 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌ శర్మతోపాటు సీనియర్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా దూరంగా ఉన్నారు. దీంతో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సిరీస్‌ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఎల్ రాహుల్‌ మాట్లాడాడు. ఈ సిరీస్‌తో రింకు సింగ్ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తాడని, అలాగే సంజు శాంసన్‌ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని రాహుల్ పేర్కొన్నాడు.

‘‘రింకు సింగ్ అద్భుతమైన ఆటగాడు. అతడిలోని ప్రతిభను ఐపీఎల్‌లో మనందరం చూశాం. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతడు ఆడిన తీరు అద్భుతం. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడాడు. రింకుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడిన అనుభవం ఉంది. ఈ వన్డే సిరీస్‌లో అతడికి కచ్చితంగా ఆడే అవకాశం లభిస్తుంది. వికెట్ కీపర్‌గా నేనే ఉంటా. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తా. టెస్టు సిరీస్‌లో కెప్టెన్, మేనేజ్‌మెంట్ నిర్ణయం మేరకు ఏ పాత్ర ఇచ్చిన సంతోషంగా స్వీకరిస్తా. టీ20ల్లోనూ దేశం తరఫున ఆడాలనుకుంటున్నా’’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని