FIFA: చిక్కడు.. దొరకడులా.. కళ్లుచెదిరే డ్రిబ్లింగ్‌తో గోల్..!
ఫుట్‌బాల్‌లో బంతిని అద్భుతంగా డ్రిబిల్ చేయగల సత్తా అతికొద్ది ఆటగాళ్లలోనే ఉంటుంది. ఇటలీకి రాబర్టో బాగియో ఆడుతున్న తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతమైన గోల్ చేశాడు
ఇంటర్నెట్‌డెస్క్: ఫుట్‌బాల్‌లో బంతిని అద్భుతంగా డ్రిబిల్ చేయగల సత్తా అతికొద్ది ఆటగాళ్లలోనే ఉంటుంది. ఇటలీ ఆటగాడు రాబర్టో బాగియో ఆ కోవకు చెందిన ఆటగాడు..! ఆడుతున్న తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతమైన గోల్ చేశాడు. ప్రపంచకప్‌ల చరిత్రలోనే కళ్లుచెదిరే గోల్స్‌పై ఫిఫా నిర్వహించిన ఓ పోల్‌లో బాగియో గోల్ 7వ స్థానంలో నిలిచింది. రాబర్టోను ఇటలీ జట్టులో ‘ది డివైన్ పోనీటెయిల్’ అని పిలుస్తారు. మైదానంలోకి దిగితే అతడు ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తూనే ఉంటాడు.
1990లో ఇటలీ ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదికైంది. రాబర్టో బాగియో ఈ టోర్నిలో సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. గ్రూప్ స్థాయిలో చివరి మ్యాచ్‌లో చెకోస్లొవాకియాతో తలపడింది. అప్పటికే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్‌లో తొలి స్థానంలో ఉంది. చెకోస్లోవాకియాతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ముగియడానికి 10 నిమిషాల ముందు బంతి రాబర్టో ఆధీనంలోకి వచ్చింది. అక్కడి నుంచి దాదాపు ముగ్గురు చెకోస్లోవాకియా ఆటగాళ్లు అతడిని వెంబడించారు. వారి నుంచి తప్పించుకొంటూ గోల్ పోస్టు సమీపానికి చేరుకొనే సరికి మొత్తం నలుగురు ఆటగాళ్ల చుట్టుముట్టారు. వారిని తప్పించుకొంటూ బంతిని అద్భుతమైన షాట్‌తో గోల్ పోస్టులోకి పంపాడు. ఆ మ్యాచ్‌ను ఇటలీ గెలుచుకొంది.
ఈ టోర్నీలో ఇటలీ మూడో స్థానంలో నిలిచింది. తొలి సారి ప్రపంచకప్ ఆడుతున్న రాబర్టో రెండు గోల్స్ చేశాడు. చెకోస్లోవాకియాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్ మొత్తం టోర్నమెంట్‌లోనే అత్యుత్తమైందిగా ఎంపిక చేశారు. 2002 ఫిఫా పోల్‌లో ఆ గోల్ ప్రపంచకప్‌ల చరిత్రలోనే 7వ అత్యుత్తమైనదిగా నిలిచింది. రాబర్టో కూడా ఇటలీ ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్‌కు వచ్చేసింది. లఖ్‌నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్‌నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్‌రైజర్స్‌కు దొరికిన మరో వార్నర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్‌లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్‌లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్‌ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్‌కు మరో పేస్ ఆల్‌రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్‌తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్‌గా అదరగొట్టి!
లఖ్‌నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్‌తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్‌తో గుజరాత్‌పై పంజాబ్‌కు విజయం అందించిన శశాంక్ సింగ్‌పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్‌కతా ఆటగాడు మళ్లీ బ్యాట్‌తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్‌ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్‌పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.. -
సిరాజ్ మియా.. ఎక్కడ బౌలింగ్ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్ ఎటాక్!
భారత స్టార్ పేసర్‌గా మారిన సిరాజ్ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను తేలిగ్గా ఆడేస్తున్నారు. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్‌పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు