IPL 2023: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‘సక్సెస్ మంత్రం’ అదే: రాబిన్ ఉతప్ప

IPL 2023: మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్‌ ( IPL 2023) 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

Published : 09 Mar 2023 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023)లో నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు చెన్నైసూపర్ కింగ్స్‌ (CSK). మిస్టర్ కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని సీఎస్‌కే ఓ కుటుంబంలా ఉంటుందని ఆ జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లు చెప్పే మాట. ఇదే సీఎస్‌కే విజయానికి ప్రధాన కారణమని ఆ జట్టు గురించి తెలిసినవారు ముక్తకంఠంతో చెబుతుంటారు. రెండేళ్ల కిందట (2021) ఏమాత్రం అంచనాలు లేకుండానే కప్‌ను ఎగురేసుకుపోయింది. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఆ జట్టుతో ఉన్న అనుబంధం గురించి టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. 

‘‘2021 సీజన్‌లో నేను చెన్నై తరఫున తొలి 12 మ్యాచ్‌లు ఆడలేదు. అయినా, జట్టులోని వాతావరణం ఎప్పుడూ ఆరోగ్యకరంగానే ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే, ఎనర్జీ  కేవలం తుది ‘11’ మందిపైనే ఆధారపడి ఉండదని ... మొత్తం 14 మందిలోనూ ఉండాలని కోరుకునే జట్టు సీఎస్‌కే. ఇక సహాయక సిబ్బంది ప్రతి ఒక్క సభ్యుడితో మాట్లాడే తీరు కూడా సీఎస్‌కేలో అద్భుతంగా ఉంటుంది. ప్రతి వారానికొకసారి అందరితో సంభాషిస్తారు. ఏ విధంగా చేస్తే జట్టుకు ప్రయోజనంగా ఉంటుంది..? తుది జట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుంది..? ఈ వారంలో మీరేం నేర్చుకున్నారు..? ఇలా ప్రతి విషయంపై చర్చిస్తారు. మరీ ముఖ్యంగా యువ క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ఆడేందుకు అవకాశం రాకపోయినా సరే.. మీరేం నేర్చుకున్నారని అడిగి తెలుసుకుంటారు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ తాము కూడా జట్టులో భాగమే అని అనుకుంటారు. దీని వల్ల అభద్రతాభావం తొలిగిపోతుంది. తమకు అవకాశం వచ్చిన సమయంలో బాగా రాణించేందుకు ప్రయత్నిస్తారు. ఇక టీమ్‌ మేనేజ్‌మెంట్‌  ‘ఆఫ్‌ ది ఫీల్డ్‌’లోనూ క్రికెటర్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది’’ అని రాబిన్‌ ఉతప్ప తెలిపాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు