BCCI: నాకు సవాళ్లు అంటే ఇష్టం.. ఆ నిర్ణయంతో షాక్‌కు గురయ్యా: రోజర్ బిన్నీ
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ. అలాంటి బోర్డుకు మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ అధ్యక్షుడిగా వచ్చారు. ఇప్పటి వరకు పదవీ బాధ్యతలు చేపట్టిన సౌరభ్ గంగూలీకి మరోసారి అవకాశం దక్కలేదు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ.. సవాళ్లను ఎదుర్కోవడం చాలా ఇష్టమని పేర్కొన్నాడు. టాప్ పొజిషన్ తీసుకోవడానికి తానేమీ కంగారు పడలేదని తెలిపాడు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయాలని కబురు వచ్చినప్పుడు కాస్త షాక్‌కు గురైనట్లు వెల్లడించాడు. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న గంగూలీకి మరోసారి అవకాశం ఇస్తారని అంతా భావించినా జరగలేదు. అయితే బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జయ్ షా మరోమారు ఆ పదవిలోనే కొనసాగుతారు.
‘‘నామినేషన్ వేయాలని నన్ను అడిగినప్పుడు షాక్‌కు గురయ్యా. బీసీసీఐలో ఏదో ఒక పోస్టు కోసం పోటీ చేయాలని అడుగుతున్నారేమో అనుకొన్నా. అయితే అధ్యక్ష పదవి అనుకోలేదు. నేను ప్రెసిడెంట్ అయినట్లు అనుకోవడానికకి ఆ రోజు రాత్రంతా పట్టింది. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా ఆనందంగానే బాధ్యతలు నిర్వర్తిస్తానని భావిస్తున్నా’’ అని రోజర్ బిన్నీ తెలిపారు. టీమ్ఇండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను నెగ్గిన జట్టులో రోజర్ బిన్నీ కీలక సభ్యుడు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి జాతీయ సెలెక్టర్‌గా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’
-
General News
TSSPDCL Jobs: గుడ్‌న్యూస్.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 ఉద్యోగాలకు ప్రకటన
-
Movies News
Yash: యశ్ ఇంటి వద్ద బారులు తీరిన అభిమానులు.. వీడియోలు వైరల్
-
India News
Modi: నాలుగేళ్లలో మోదీ 21 విదేశీ పర్యటనలు.. ఖర్చెంతో తెలుసా?
-
Politics News
BJP: 24 గంటల ఫ్రీ కరెంట్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: ఈటల రాజేందర్