BCCI : బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ

ముంబయిలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రోజర్‌ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా ప్రకటించారు.

Published : 18 Oct 2022 13:22 IST

ముంబయి :  బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ ఎన్నికయ్యారు. భారత మాజీ ఆటగాడు, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు సభ్యుడైన బిన్నీ.. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. సౌరభ్‌ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ముంబయిలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన్ను బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. బిన్నీ ఒక్కరే ఈ పదవికి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బిన్నీ.. ప్రస్తుతం ఆ పదవిని వదులుకోనున్నారు. సందీప్‌ పాటిల్‌ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో బిన్నీ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగానూ కొనసాగారు. మీడియం పేసరైన బిన్నీ 1983 ప్రపంచకప్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని