BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు
బీసీసీఐలో పదవుల కోసం సంగ్రామం మొదలు కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం టీమ్ఇండియా మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ రంగంలోకి దిగారు. బీసీసీఐ పదవుల కోసం అభ్యర్థులు నామినేషన్లు దాఖలుకు రెండు రోజులు అవకాశం కల్పించగా.. తొలిరోజు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైనట్లు తెలుస్తోంది. బుధవారం కూడా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమవుతుంది. బిన్నీ 1983 ప్రపంచకప్ జట్టులో సభ్యుడు. ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఉండకపోవచ్చని ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. ప్రస్తుతం సౌరభ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జయ్ షా.. మరోసారి సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థిగా ఎవరూ రంగంలోకి దిగకపోతే వరుసగా రెండోసారి కార్యదర్శిగా పదవిని చేపట్టే అవకాశం ఉంది. సౌరభ్ గంగూలీ ఐసీసీ బోర్డులోకి వెళ్తే.. జయ్ షా బీసీసీఐ అధ్యక్షుడిగా బరిలోకి దిగుతాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే అధ్యక్ష బరిలోకి రోజర్ బిన్నీ రావడం.. గంగూలీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో జయ్ షా కార్యదర్శిగానే కొనసాగేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!