Published : 11 Feb 2022 01:17 IST

Rohit Sharma : చాహల్‌పై రోహిత్ శర్మ అసహనం.. ఎందుకంటే..?

ఇంటర్నెట్ డెస్క్‌: యుజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌లో ఎంత ప్రతిభావంతుడో.. ఫీల్డింగ్‌లోనూ అంతే చురుగ్గా ఉంటాడు. అయితే తాజాగా టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ.. చాహల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 45వ ఓవర్‌ను వేసేందుకు వాషింగ్టన్‌ సుందర్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో వెనక్కి వెళ్లాలని చాహల్‌కు రోహిత్‌ చెప్పాడు. అయితే చాహల్ నెమ్మదిగా వెళ్తుండటంతో.. రోహిత్ కొంచెం సీరియస్‌గా ‘‘వెనక్కి వెళ్లు.. ఏమైంది నీకు..? సరిగ్గా ఎందుకు పరుగెత్తలేకపోతున్నావు’’ అంటూ అసహనం ప్రదర్శిస్తూ మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు కామెంట్లతో చెలరేగిపోయారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని