Rohit Sharma : అందుకే శ్రేయస్ అయ్యర్‌ని పక్కన పెట్టాం : రోహిత్‌ శర్మ

వెస్టిండీస్‌తో బుధవారం (ఫిబ్రవరి 16న) జరిగిన తొలి టీ20 మ్యాచులో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే..

Published : 18 Feb 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వెస్టిండీస్‌తో బుధవారం (ఫిబ్రవరి 16న) జరిగిన తొలి టీ20 మ్యాచులో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచులో శ్రేయస్‌ (80) కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయినా, తొలి టీ20 మ్యాచులో దక్కలేదు. ఈ విషయంపై తాజాగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్సందించాడు. అతడిని పక్కన పెట్టడానికి గల కారణాలను వివరించాడు.

‘శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాడిని పక్కన పెట్టడం కాస్త కష్టమే. కానీ, మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్ చేయగల ఆటగాడు జట్టుకు చాలా అవసరం. అందుకే, అతడిని పక్కన పెట్టక తప్పలేదు. శ్రేయస్‌ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రపంచ కప్‌ జట్టులో అతడికి కచ్చితంగా చోటు ఉంటుంది. జట్టుకు ఏం కావాలో ఆటగాళ్లకు బాగా తెలుసు. ఆటగాళ్లంతా అందుబాటులో ఉన్నప్పుడూ.. ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తుది జట్టు కూర్పు విషయంలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణించే ఆటగాళ్ల విషయంలో మాకు స్పష్టత ఉంది. యువ ఆటగాళ్లు కూడా జట్టు విజయాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారనుకుంటున్నాను. ఇషాన్‌ కిషన్‌ చాలా కాలంగా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున అతడు ఓపెనర్‌గానే బరిలోకి దిగుతున్నాడు’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. తొలి టీ20 మ్యాచులో రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌  మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని