IND vs PAK: షహీన్‌పై రోహిత్‌-గిల్‌ ఎదురుదాడి పాక్‌కు ఆందోళనకరమే..!

రోహిత్‌ శర్మ-శుబ్‌మన్‌ గిల్‌ జోడీ పుంజుకొని ఏస్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రిది(Shaheen Afridi)పై ఎదురు దాడి చేయడం పాక్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని దినేష్‌ కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు. మరో వైపు రోహిత్‌లో భారీ షాట్లు ఆడే సత్తా ఏమాత్రం కొరవడలేదని సంజయ్‌ మంజ్రేకర్‌ చెబుతున్నాడు. 

Updated : 11 Sep 2023 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియాకప్‌లో సూపర్‌-4 దశలో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. నేడు రిజర్వ్‌డే నాడు ఆట కొనసాగనుంది. కానీ, ఈ మ్యాచ్‌ భారత్‌ ఆత్మవిశ్వాసం పుంజుకోవడానికి బాటలు వేసింది. పాక్‌ సూపర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షహీన్‌ అఫ్రిది(Shaheen Afridi)ని భారత ఓపెనర్లు రోహిత్‌(Rohit Sharma)-గిల్‌ (Shubman Gill) దంచికొట్టడం శుభ సంకేతంగా నిలిచింది. ఈ విషయంపై టీమ్‌ఇండియా కీపర్‌ దినేష్‌ కార్తిక్‌ ఓ క్రీడా వెబ్‌సైట్‌ వద్ద స్పందిస్తూ.. ‘‘షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో విరుచుకుపడి ఎదురు దాడి చేసిన తీరు పాకిస్థాన్‌కు ఆందోళనకరం. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో పరిస్థితులు కూడా సీమర్లకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ, భారత్‌ ఓపెనింగ్‌ జోడీ భారీ షాట్లను ఆడింది’’ అని విశ్లేషించాడు. ఇక షహీన్‌ స్లో డెలివరీకి శుభ్‌మన్‌ వికెట్‌ సమర్పించుకోవడంపై మాత్రం కార్తిక్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. షహీన్‌ మణికట్టు ఫ్లిక్‌ కావడంతో అతడి స్లోడెలివరీలను అర్థం చేసుకోవడం బ్యాటర్లకు కష్టమైపోతుందన్నాడు. గిల్‌ వరుసగా రెండోసారి షహీన్‌కు వికెట్‌ సమర్పించుకోవడంపై మాత్రం కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

షాట్లు కొట్టే సహజ శక్తి రోహిత్‌ కోల్పోలేదు: మంజ్రేకర్‌

కొలంబోలో జరిగిన ఆసియాకప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో రోహిత్‌ (Rohit Sharma) మెరుపు అర్థశతకం సాధించడాన్ని టీమ్‌ఇండియా మాజీ సంజయ్‌ మంజ్రేకర్‌ అభినందించాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఎదురు దాడి చేసే సామర్థ్యం రోహిత్‌లో ఏమాత్రం తగ్గలేదన్నాడు. ‘‘అతడు గత ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాదాడు కదా. నా అంచనా ప్రకారం అతడి డిఫెన్స్‌ ఇప్పుడు మరింత మెరుగుపడింది. 2019తో పోలిస్తే ఇప్పుడు మెరుగైన టెస్టు క్రీడాకారుడిగా రూపొందాడు. కాకపోతే అతడు శుభారంభాలను భారీ శతకాలుగా రూపొందించాలి. అందుకోసం ఇన్నింగ్స్‌లో ముందుకు పోయే కొద్దీ సింగల్స్‌, డబుల్స్‌ చేస్తుండాలి. కానీ, నాణ్యమైన డిఫెన్స్‌ కారణంగా రోహిత్‌ నేడు మెరుగైన ఆటగాడిగా నిలిచాడు. భారీ షాట్లు కొట్టగల సహజసిద్ధమైన సత్తా అతడిలో ఇంకా ఉంది’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు అర్థ శతకాలను.. శతకాలుగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

ముద్దు తెచ్చిన తంటా.. పదవి కోల్పోయిన ఫుట్‌బాల్‌ చీఫ్

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ నిరూపించుకోవడానికి ప్రపంచకప్‌ కంటే ముందే అవకాశం ఇవ్వాలని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన  కేఎల్‌ రాహుల్‌ నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చారన్నాడు. అలాంటప్పుడు సూర్యకు కూడా కచ్చితంగా ఓ అవకాశం ఇవ్వాలని చెప్పాడు. వన్డేల్లో అతడి ఆటతీరుపై ఇంకా సందేహాలున్నాయని.. టీ20 స్థాయి ఆటతీరు వన్డేల్లో ప్రదర్శిస్తాడా అన్నది ఇంకా ఎవరికీ తెలియదని మంజ్రేకర్‌ అన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు