Team India: రోహిత్‌ దూరం.. రహానేకు సారథ్యం!

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఎవరు నడిపిస్తారనే విషయంపై ఓ స్పష్టత వచ్చినట్లే! టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె ఆ మ్యాచ్‌లో

Updated : 12 Nov 2021 08:33 IST

కివీస్‌తో తొలి టెస్టు

దిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఎవరు నడిపిస్తారనే విషయంపై ఓ స్పష్టత వచ్చినట్లే! టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె ఆ మ్యాచ్‌లో సారథిగా వ్యవహరిస్తాడని సమాచారం. ఈ నెల 17న కివీస్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20, రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి స్థానంలో రోహిత్‌కు ఆ పగ్గాలు అందించారు. మరోవైపు పని భారం కారణంగా కోహ్లి సహా కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఇక వన్డే, టెస్టుల్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా కొనసాగే కోహ్లి.. కివీస్‌తో ఈ నెల 25న కాన్పూర్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టుకూ దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆ టెస్టులో జట్టును కొత్తగా టీ20 సారథిగా ఎంపికైన రోహిత్‌ నడిపిస్తాడా? లేదా టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె సారథిగా వ్యవహరిస్తాడా? అనే సందేహాలు రేకెత్తాయి. బ్యాట్‌తో ఫామ్‌లో లేని రహానె కంటే కూడా రోహిత్‌కే ఆ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపించాయి. కానీ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ దూరం కానున్నట్లు తాజా సమాచారం. దీంతో రహానేనే తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉంటాడు. ముంబయిలో జరిగే రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్న కోహ్లీనే సారథిగా వ్యవహరిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని