Rohit Sharma: భార్య పేరిట నాలుగు ఎకరాలు కొన్న రోహిత్‌ శర్మ.. ధర ఎంతంటే?

టీమ్‌ఇండియా కెప్టెన్‌ ప్రమోషన్‌ పొందిన రోహిత్ శర్మ మంచి జోష్‌ మీదున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌ చేసి కెప్టెన్‌గా మంచి ఆరంభం అందుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు వైస్‌

Updated : 17 Dec 2021 06:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్‌ ప్రమోషన్‌ పొందిన రోహిత్ శర్మ మంచి జోష్‌ మీదున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌ చేసి కెప్టెన్‌గా మంచి ఆరంభం అందుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు వైస్‌ కెప్టెన్‌గాను ఎంపికయ్యాడు. ఈ సంతోషకరమైన సందర్భంలో హిట్‌మ్యాన్‌ తన భార్య రితికా సజ్‌దేహ్‌ పేరిట భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని దక్షిణ అలీబాగ్‌లో రూ.9 కోట్లతో నాలుగు ఎకరాలను కొనుగోలు చేశాడట. దీనికి సంబంధించి ఈ నెల 14న రిజిస్ట్రేష‌న్ కూడా పూర్త‌యినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన భూమి.. అలీబాగ్ న‌గ‌రానికి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సరళ్‌ మహాత్రోలి అనే గ్రామంలో ఉంటుంది.

"భూమికి సంబంధించిన  రిజిస్ట్రేషన్‌ కోసం రోహిత్ శర్మ మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ, అతడు భూమిని కొన్నాడా  లేదా అతడితో పాటు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశారా అన్నది మాకు తెలియదు" అని అలీబాగ్‌ సబ్ రిజిస్టర్ సంజన జాదవ్‌ పేర్కొన్నారు. ఆ గ్రామ సర్పంచ్‌ అమిత్ నాయక్‌ మాట్లాడూతూ.. "రోహిత్‌ శర్మ తన భార్య పేరిట 4ఎకరాల భూమిని  కొనుగోలు చేశాడు. దాని విలువ సూమారు రూ.9 కోట్లు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత మా గ్రామానికి వచ్చి ఆ స్ధలంలో పూజలు చేశారు" అని పేర్కొన్నాడు.

సచిన్‌, కోహ్లిలకు కూడా

క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెందూల్కర్‌తోపాటు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్‌ అజిత్ అగార్క‌ర్‌, మాజీ కోచ్‌ ర‌విశాస్త్రికి సైతం ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. అలీబాగ్‌ సుందరమైన ప్రాంతాల‌లో ఒక‌టిగా పేరుగాంచింది. ఇది పర్యాటక ప్రదేశం కూడా. అందువల్లే రోహిత్‌ అక్కడ భూమి కొన్నట్లు తెలుస్తోంది. కాగా, మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్‌ దూరమైన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని