WTC Final: రేపటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్.. కెప్టెన్‌ రోహిత్ శర్మకు గాయం!

భారత్, ఆసీస్‌ మధ్య రేపటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహాసంగ్రామానికి ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎడమ బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.

Updated : 06 Jun 2023 16:40 IST

లండన్: భారత్, ఆసీస్‌ మధ్య రేపటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహాసంగ్రామానికి ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎడమ బొటనవేలికి గాయమైనట్లు సమాచారం. మంగళవారం నెట్ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో అతడు గాయపడినట్లు తెలుస్తోంది. అతనికి వెంటనే భారత ఫిజియోలు వైద్య సహాయం అందించారు. చేతికి బ్యాండెజీలు వేసుకున్న తర్వాత రోహిత్ తిరిగి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి గాయం తీవ్రమైనది కాదని అర్ధమవుతోంది. రోహిత్‌ గాయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

జూన్ 7 నుంచి ఓవల్‌ మైదానం వేదికగా ప్రారంభమ్యే మ్యాచ్‌కు రోహిత్‌ అందుబాటులో ఉండాలని టీమ్‌ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి భారత్‌కు పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరవును తీర్చాలని ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. అక్కడ ఆడిన 5 టెస్టుల్లో 402 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగబోతున్న ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై (2021లో) అతను సెంచరీ (127) చేయడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని