Rohit Sharma: రోహిత్ శర్మ న్యూ లుక్.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు

గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమైన టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్ శర్మ.. ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో న్యూ లుక్‌లో కనిపించి తన అభిమానులను

Published : 15 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమైన టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్ శర్మ.. ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో న్యూ లుక్‌లో కనిపించి తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. హిట్‌మ్యాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన భార్య రితికా సజ్‌దేహ్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. సాధారణంగా గడ్డం, చిన్నపాటి మీసాలతో కనిపించే రోహిత్ శర్మ.. తాజాగా పూర్తిగా ట్రిమ్‌ చేసేశాడు. మరో ఫొటోలో తలకు టోపీ ధరించి సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. హిట్‌మ్యాన్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటికి వందల సంఖ్యలో కామెంట్లు, లక్షల్లో లైక్‌లు వచ్చాయి. మరోవైపు, జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కి కూడా రోహిత్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈ సిరీస్‌కి అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని