Rohit Sharma: కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారో?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ.. డిసెంబరు 22 నుంచి బంగ్లాతో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు భారత్‌కు రావడంతో బంగ్లాతో మూడో వన్డే, తొలి టెస్టుకు దూరమయ్యాడు. డిసెంబరు 22 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్టు ప్రారంభం అయ్యే నాటికి అతడు గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం. త్వరలోనే రోహిత్ బంగ్లాదేశ్ చేరుకొని జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్టు కోసం కెప్టెన్ రోహిత్ తిరిగి జట్టులో చేరితే తుది జట్టులో ఎవరిని తప్పిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తొలి టెస్టులో బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్‌లో వైస్ కెప్టెన్ కేఎల్, రాహుల్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించారు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పూజారా తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో (102) శతకం బాదాడు. దీంతో వీరిద్దరూ తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ప్రదర్శనే కనబరచడంతో వారిని తప్పించే అవకాశం కనపడటం లేదు. బ్యాటర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమవడం, గత కొంతకాలంగానూ మెరుగైన ప్రదర్శనలు చేయకపోవడంతో కేఎల్ రాహుల్ స్థానానికే ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్‌ని తప్పిస్తే రోహిత్‌కి ఓపెనింగ్ జోడీగా గిల్‌ని పంపే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక