Rohit Sharma: మేం 25 పరుగులు అదనంగా ఇచ్చాం.. గిల్ వల్లే ఓడాం: రోహిత్ శర్మ
ఎలిమినేటర్‌లో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్ (MI).. కీలకమైన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. గుజరాత్ చేతిలో ఘోర ఓటమితో ఇంటిముఖం పట్టింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతోపాటు మోహిత్ శర్మ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో గుజరాత్ (GT) ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆరో టైటిల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో రెండో క్వాలిఫయర్ ఆడిన ముంబయి ఇండియన్స్‌కు (MI) చుక్కెదురైంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమిపాలై (GT vs MI) ఇంటిముఖం పట్టింది. శుభ్‌మన్ గిల్ భారీ సెంచరీ సాధించడంతో గుజరాత్ 233 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 171 పరుగులకే పరిమితమైంది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో (5/10) హడలెత్తించాడు. సూర్యకుమార్‌ను కీలక సమయంలో ఔట్ చేసి గుజరాత్‌ను గెలిపించాడు. పెద్దగా ఫామ్‌లో లేని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌పై, తమ జట్టుఓడిపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో మేం 25 పరుగులు అదనంగా ఇచ్చాం. శుభ్‌మన్ గిల్‌కే ఈ క్రెడిట్ దక్కతుంది. ఇదే ఫామ్‌ను అతడు కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. గ్రీన్, సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్నప్పుడు మేం గెలుస్తామనే నమ్మకం ఉంది. వారిద్దరు ఔట్ కావడంతో దారితప్పినట్లు అనిపించింది. పవర్‌ప్లేలోనూ ఇంకాస్త పరుగులు చేయాల్సింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో శుభ్‌మన్ ఆడినట్లు.. మా జట్టులోనూ ఒక్కరు నిలబడినా ఫలితం మరోలా ఉండేది. బౌండరీ లైనప్‌లు తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమయంలోనైనా ఫలితం మారిపోతుంది.
ఇషాన్ కిషన్ గాయపడటం కూడా మాకు నష్టం చేసింది. అనుకోకుండా అలా జరిగిపోయింది. దీంతో కంకేషన్‌ను తీసుకొచ్చినా లాభం చేకూరలేదు. ఈ సీజన్‌లో ఇక్కడిదాకా రావడం, ఫ్లేఆఫ్స్‌నకు అర్హత సాధించడం తేలికైన విషయం కాదు. వచ్చే సీజన్‌లో మరింత సానుకూలంగా ఆడేందుకు తప్పకుండా తిరిగి వస్తాం. మా బ్యాటింగ్ విభాగం ఇతర జట్ల బౌలింగ్‌కు సవాల్‌గా మారింది’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
మా శ్రమకు ఫలితం: హార్దిక్
‘‘మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. సాధన చేస్తూనే ఉండటం వల్ల ఇలాంటి ఫలితం దక్కింది. శుభ్‌మన్ గిల్ ఆడే విధానం అద్భుతం. ఆత్మవిశ్వాసంతోపాటు షాట్ల ఎంపికపై స్పష్టతతో ఉంటాడు. ఎప్పుడూ హడావుడిగా కనిపించడు. భారీ షాట్లను అలవోకగా కొట్టేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఫ్రాంచైజీ క్రికెట్ అయినా సరే అతడొక సూపర్ స్టార్. గిల్‌తో మాట్లాడుతూనే ఉంటా. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు. క్లిష్టపరిస్థితుల్లో నాకు భరోసా కల్పించే ఆటగాడు రషీద్ ఖాన్. అంతకంటే ఇంకేం చెప్పలేను. ఫైనల్‌లోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించేందుకు ఉత్సాహంతో ఉన్నాం’’ అని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.
వారిని ఔట్ చేయకపోతే కష్టమని తెలుసు: మోహిత్ శర్మ
ముంబయిపై ఐదు వికెట్లు తీసి గుజరాత్ విజయంలో మోహిత్ శర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఐదు వికెట్లు తీయడం అదృష్టంగా భావిస్తున్నా. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ చేజారేలా ఉందనిపించింది. వారిద్దరిని ఔట్ చేయకపోతే కష్టమని తెలుసు. సూర్యకుమార్‌కు బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రయోగాలకు పోకూడదని భావించా. సహచరులతో చర్చ సందర్భంగా కూడా ఇదే మాట్లాడుకున్నాం. అతిగా ప్రయోగాలు చేస్తే సూర్య అలవోకగా ఆడేస్తాడని మాకు తెలుసు. సూర్య వికెట్ తీయడంతో మేం గేమ్‌లోకి వచ్చేశాం. అప్పుడే ఫైనల్‌కు వెళ్లిపోయినట్లు భావించాం’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs ENG: ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్.. భారత్‌దే తొలి బ్యాటింగ్
-
Anirudh: 81 మిలియన్ల ‘హుకూం’.. మా ప్లానింగ్‌లో అస్సలు లేదు: అనిరుధ్
-
Asian Games: టెన్నిస్‌లో బంగారు పతకం.. రోహన్ బొపన్న - రుతుజ జోడీ అదుర్స్
-
Uttar Pradesh: రీల్స్‌కు లైక్ కొడతారా.. లేక దెబ్బలు తింటారా! .. టీచర్ల నిర్వాకం
-
Balakrishna: పవన్ ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం: బాలకృష్ణ
-
Jawan: షారుక్ ‘జవాన్’ ఖాతాలో మరో రికార్డ్