Rohit Sharma: డెత్‌ ఓవర్ల బౌలింగ్‌.. ఆ అవసరం కచ్చితంగా ఉందన్న రోహిత్‌

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్‌ కష్టపడక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీమ్‌ ఇండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌పై చర్చ మొదలైంది.

Published : 04 Oct 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  దక్షిణాఫ్రికాపై సిరీస్‌ విజయంతో టీమ్‌ఇండియా సగర్వంగా టీ20 ప్రపంచకప్‌ వైపు అడుగులు వేసింది. గువాహటిలో జరిగిన రెండో టీ20లో రోహిత్‌ సేన దంచికొట్టింది. అయితే.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అటువైపు నుంచి కూడా అంతే దీటుగా సమాధానం వచ్చింది. లక్ష్యానికి కేవలం 16 పరుగుల దూరంలోనే సఫారీలు నిలిచిపోయారు. కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్‌ కష్టపడక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీమ్‌ ఇండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌పై చర్చ మొదలైంది. మ్యాచ్‌ అనంతరం ఈ అంశంపై సారథి రోహిత్‌ కూడా స్పందించాడు.

డెత్‌ ఓవర్ల అంశం ఆందోళన కలిగించకపోయినా.. మ్యాచ్‌ చివరలో జట్టు తన పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్‌ చెప్పాడు. ‘జట్టు ఒక నిర్ధిష్ట పద్ధతితో బౌలింగ్‌ చేయాలని కోరుకుంటుంది. ఆ రకంగా బౌలర్లకు స్వేచ్ఛనివ్వాలనుకుంటాం. నిజమే.. మేం గత ఐదారు మ్యాచ్‌ల్లో డెత్‌ ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేయలేదు. ఆ అంశమే మాకు సవాలు విసిరేది’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

‘అయితే.. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. ఇది ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. ఇది కచ్చితంగా మనం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అంశం’ అని హిట్‌మ్యాన్‌ వివరించాడు.

తొలి టీ20లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్‌లో ఏకంగా 62 పరుగులివ్వడమే కాదు.. మూడు నోబాల్స్‌, రెండు వైడ్లు వేసి ప్రపంచకప్‌ ముంగిట మన బౌలింగ్‌పై ఆందోళనను ఇంకా పెంచాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా..  3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదన ఆరంభంలో తడబడ్డా దక్షిణాఫ్రికా ఆ తర్వాత గట్టి పోటీ ఇచ్చింది. మిల్లర్‌ (106 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 7×6), డికాక్‌ (69 నాటౌట్‌; 48 బంతుల్లో 4×3, 4×6) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని