Rohit Sharma: కరోనా నుంచి కోలుకున్న రోహిత్‌.. నెట్స్‌లో ప్రాక్టీస్

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో మొదలయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సన్నద్ధమవుతున్నాడు...

Published : 04 Jul 2022 16:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో మొదలయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఐసోలేషన్‌ నుంచి బయటకు వచ్చి నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతోన్న కీలక ఐదో టెస్టుకు ముందు రోహిత్‌ జూన్‌ 25న కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ టెస్టుకు దూరమవ్వగా బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. అయితే, రోహిత్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసినా తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే శుభ్‌మన్‌తో కలిసి పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనింగ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 300 పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు టీమ్‌ఇండియా జులై 7, 9, 10 తేదీల్లో మూడు టీ20లు ఆడనుండగా 12, 14, 17 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది. వాటికి రోహితే కెప్టెన్సీ చేయనున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని