IND vs AUS: సిరీస్‌పై టీమ్‌ఇండియా కన్ను.. రెండో వన్డేకి రోహిత్ శర్మ!

ఆదివారం వైజాగ్‌ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.  ఈ క్రమంలో టీమ్‌ఇండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ రెండో వన్డేకి అందుబాటులోకి వస్తాడని సమాచారం.

Published : 18 Mar 2023 16:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో (IND vs AUS) టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ (75*), రవీంద్ర జడేజా (45*) భారత్‌ను గెలిపించారు. దీంతో వైజాగ్‌లో జరిగే రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో భారత అభిమానులకు శుభవార్త. బావమరిది పెళ్లి కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ జట్టులో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

రెండో వన్డేలో కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు..? తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ (KL Rahul) సూపర్‌ ఇన్నింగ్స్‌తో తన స్థానానికి ఢోకా లేకుండా చేసుకున్నాడు. ముంబయిలో విఫలమైన ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌లో ఒకరిపై వేటు తప్పదు. సీనియర్‌ అయిన సూర్యకుమార్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వొచ్చు. దీంతో ఇషాన్‌ను పక్కన పెట్టేయడం ఖాయం. బౌలింగ్‌ విభాగంలో మార్పులేమి ఉండకపోవచ్చు. అదనంగా మరొక బ్యాటర్ / స్పిన్నర్‌ను తీసుకోవాలంటే కుల్‌దీప్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ తీసుకుంటే ఉత్తమం. ఒకవేళ రోహిత్ అందుబాటులోకి రాకపోతే మాత్రం ఇదే జట్టుతో హార్దిక్‌ కొనసాగుతాడు. అప్పుడు వచ్చిన ఛాన్స్‌ను ఇషాన్‌ సద్వినియోగం చేసుకోకపోతే మరోసారి చోటు దక్కడం కష్టమే. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు