Rohit Sharma: ‘మూడేళ్లు’ అనే పదం చాలా పెద్దదిగా అనిపిస్తోంది: చిరాకుపడ్డ రోహిత్ శర్మ
న్యూజిలాండ్ సిరీస్ మూడో వన్డే బ్రాడ్‌కాస్టర్‌పై టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) చిరాకుపడ్డాడు. అసలు విషయాలు చూపించాలని హితవు పలికాడు.
ఇంటర్నెట్‌డెస్క్: దాదాపు మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత హిట్‌మ్యాన్(Rohit Sharma) నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో శతకం చేశాడు. వన్డేల్లో 2020 జనవరి తర్వాత చేసిన శతకంగా గణాంకాలతో పేర్కొంటూ ఆ సమయంలో చూపించడంతో.. బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్(Rohit Sharma) చిరాకు పడ్డాడు. ఆ విషయాన్ని అతడు విలేకర్ల సమావేశంలో ఏమాత్రం దాచుకోలేదు. ‘మూడేళ్లలో తొలి శతకం’పై మాట్లాడుతూ.. ‘‘ ఈ మూడేళ్లలో 17 మ్యాచ్‌లు జరిగితే నేను 12 ఇన్నింగ్స్‌లే ఆడాను. ఈ రకంగా చూస్తే మూడేళ్లు అనేది చాలా పెద్ద పదంలా అనిపిస్తోంది. ఏం జరుగుతోందో మీరు అర్థం చేసుకోవాలి. బ్రాడ్‌కాస్టర్ అలా ప్రసారం చేశారని నాకూ తెలుసు. కానీ, అప్పుడప్పుడు సరైన అంశాలపై దృష్టిపెట్టాలి. బ్రాడ్‌కాస్టర్ కూడా సరైన విషయాలను చూపించాలి’’ అని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.
రోహిత్ ఇన్నింగ్స్‌పై ఓ విలేకరి ప్రశ్నిస్తూ..‘‘హిట్‌మ్యాన్ పునరాగమనమా..?’’ అని ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ.. ‘‘2020లో వన్డేలు జరగలేదు. కొవిడ్ కారణంగా అందరూ ఇళ్లల్లోనే కూర్చొన్నారు. ఆ సమయంలో నేను రెండు టెస్టులు ఆడాను. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మేం గత సంవత్సరం నుంచి టీ20లు ఆడుతున్నాం. టీ20ల్లో అప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను మించిన బ్యాటర్ లేడు. అతడు ఏకంగా రెండు శతకాలు చేశాడు. అంతకు మించి ఎవరూ చేయలేదని అనుకొంటున్నా’’ అని రోహిత్ విశ్లేషించాడు.
మ్యాచ్ కీలక సమయాల్లో శార్దూల్ బంతితో రాణించడంపై రోహిత్ సంతృప్తి వ్యక్తం చేస్తూ..‘‘ అతడు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే నేర్పు అలవర్చుకొన్నాడు. కేవలం వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లో కూడా వికెట్లు సాధిస్తున్నాడు. అతడు మాకు చాలా కీలకం. భవిష్యత్తులో కూడా అతడు ఇలానే రాణిస్తాడని ఆశిస్తున్నాను. ఇది జట్టుకు మంచి చేయడంతోపాటు.. వికెట్లు తీసుకోగలను అనే ఆత్మవిశ్వాసం అతడిలో పెరుగుతుంది. శార్దూల్ చాలా తెలివైనవాడు. దేశీయంగా చాలా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఏం చేయాలనేదానిపై అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.
టామ్ వికెట్ కోసం శార్దూల్, హార్దిక్, కోహ్లీ వ్యూహ రచన
న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ వికెట్ తీసేందుకు శార్దూల్, హార్దిక్, కోహ్లీలు కలిసి వ్యూహరచన చేసినట్లు రోహిత్ వివరించాడు. ‘‘ ఈ ఫార్మాట్లో మీ స్కిల్స్‌ను కచ్చితంగా ఉపయోగించాలి. శార్దూల్ కచ్చితంగా వాటిని వాడతాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన నకుల్ బాల్ వేసి టామ్ వికెట్‌ను పడగొట్టాడు. విరాట్, హార్దిక్, శార్దూల్ అద్భుతంగా ప్లానింగ్ చేశారు’’ అని అన్నాడు.
గిల్‌పై పొగడ్తల వర్షం..
టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆటతీరును రోహిత్ పొగడ్తలతో ముంచెత్తాడు.‘‘అతడు ఈ సిరీస్‌లో ఆడిన తీరు గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతడికి ఆటపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు. మాకు అదే కావాలి. పిచ్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలంగా ఉన్నా.. ద్విశతకం అనేది సామాన్యమైన విషయం కాదు. గిల్ ద్విశతకం సాధించిన మ్యాచ్‌లో రెండో వ్యక్తిగత అత్యధిక స్కోరు 34. ఈ ఒక్క విషయమే గిల్ ఎంత లెక్కప్రకారం ఆడాడో తెలియజేస్తుంది. అతడు అద్భుతమైన పరిపక్వత సాధించాడు. ఈ సిరీస్‌కు ముందు మేము 4వ స్థానంలో ఉన్నాం. ఆ ర్యాంకులో ఎందుకున్నామో అర్థంకాలేదు. గతేడాది ఏ సిరీస్ ఓడిపోలేదు. మేము ఆ విషయాల్లోకి పెద్దగా వెళ్లం. తర్వాత పెద్ద టోర్నమెంట్లకు సిద్ధమవుతాం. మేము ప్రతి సవాలుకు సిద్ధం కావాలి. ఈ సిరీస్‌లు అన్నీ మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి’’ అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!
-
Crime News
Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు