IND vs AUS : ‘రోహిత్‌-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే

ఆస్ట్రేలియాతో మూడో వన్డే(IND vs AUS) వేళ.. రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ జంట(Rohit Sharma-Virat Kohli) ముందు మరో ప్రపంచ రికార్డు వేచి ఉంది. వీరిద్దరూ మరో 2 పరుగులు చేస్తే ఓ మైలురాయిని అందుకుంటారు.

Updated : 22 Mar 2023 13:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారత్‌-ఆస్ట్రేలియా(IND vs AUS)ల మధ్య సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే చెన్నైలో జరుగుతోంది. తొలి వన్డేలో గెలిచి.. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమై చిత్తుగా ఓడిన రోహిత్‌ సేనకు కీలక పోరు ఇది. అయితే.. ఈ సిరీస్‌లో పెద్దగా రాణించని రోహిత్‌-కోహ్లీ (Rohit Sharma-Virat Kohli)ల ముందు ఓ ప్రపంచ రికార్డు వేచి ఉంది. వీరిద్దరూ కలిసి మరో 2 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన జంట(fastest pair)గా నిలవనున్నారు.

వన్డేల్లో 85 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌-కోహ్లీ జంట 4998 పరుగులు చేసింది. ఇక ఈ మూడో వన్డేలో మరో రెండు పరుగులు జోడిస్తే అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన జంటగా వీరు చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు వెస్టిండీస్‌ జంట గ్రీనిడ్జ్‌-డెస్మండ్‌ హేన్స్‌ పేరిట ఉంది. వీరు మొత్తం 97 ఇన్నింగ్స్‌లో ఈ మైలు రాయి చేరుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జంట  మాథ్యూ హెడెన్‌-గిల్‌క్రిస్ట్‌(104 ఇన్నింగ్స్‌) ఉంది.  ఇక ఈ జాబితాలో నాలుగు వేలకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిని తీసుకుంటే.. 60 కంటే ఎక్కువ యావరేజ్‌ ఉన్న ఏకైక జంట రోహిత్‌-కోహ్లీనే కావడం విశేషం.

ఇక వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన జంట జాబితాలో రోహిత్‌-కోహ్లీ 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో సచిన్‌-గంగూలీ 8227 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని