Cricket News: లంకతో వన్డేలకు రోహిత్, కోహ్లి దూరం!

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, బుమ్రా వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.

Updated : 09 Jul 2024 12:18 IST

దిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, బుమ్రా వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలో టెస్టు సీజన్‌ ఆరంభం కానుండడం.. కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్‌ (Cricket) ఆడుతుండడమే వారి నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. కేఎల్‌ రాహుల్‌ లేదా హార్దిక్‌ పాండ్య ఈ సిరీస్‌లో జట్టును నడిపించే అవకాశముంది. 37 ఏళ్ల రోహిత్‌ (Rohit Sharma) డిసెంబరు-జనవరి నెలల్లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌తో మొదలు ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. కోహ్లి మధ్యలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. తర్వాత ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌ ఆడాడు. వీళ్లిద్దరూ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. లంకతో వన్డే సిరీస్‌ ముగిశాక భారత్‌.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్‌కు రోహిత్, కోహ్లి (Virat Kohli) అందుబాటులోకి వస్తారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనున్న టీమ్‌ఇండియా.. ఏడాది చివర్లో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని