Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియాలో యువకులకు అవకాశాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ప్రతి సిరిస్‌కు ఓ కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు

Published : 12 Aug 2022 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాలో యువకులకు అవకాశాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ప్రతి సిరీస్‌కు ఓ కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. కొందరి ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం వస్తే.. మరికొందరికి రెండు, మూడు సిరీస్‌ల తర్వతా వచ్చింది. అయితే, భారత జట్టు సిరీస్‌ గెలిచిందంటే చాలు మిగిలిన మ్యాచ్‌లకు రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్ల అవకాశం ఇస్తున్నారు. దీనిపై తాజా టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడాడు.

‘మేము చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నాం. కాబట్టి ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్బాల్లో ఆటలో తీరికలేని కారణంగా విశ్రాంతి అవసరం. ఇలాంటి సమయాల్లో రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉండటం ముఖ్యం. వారికి ఛాన్స్‌లు ఇస్తూ ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగవుతుంది. తద్వారా భారత్‌ క్రికెట్‌ను సురక్షితమైన చేతుల్లో పెట్టవచ్చు. ఈ ప్రణాళికతోనే ఆటగాళ్ల రొటేషన్‌ జరుగుతుంది. గెలుపోటములు ముఖ్యం కాదు. మేం ఒక జట్టుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తాం. మేమంతా కలిసి రాణిస్తేనే జట్టు విజయానికి తోడ్పడగలం. ఆ దిశగానే పనిచేస్తున్నాం. భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తమ మధ్య జరిగిన సంభాషణల గురించి రోహిత్ చెప్పాడు.

"ద్రవిడ్‌ సార్‌ భారత జట్టు కోచ్‌గా వచ్చినప్పుడు, అతనితో జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే దానిపై మాట్లాడాను. అతను నాలాంటి ఆలోచనా విధానంతోనే ఉన్నాడు. దీంతో జట్టును నడిపించడం నాకు సులభమవుతోంది. జట్టు ఒకే దిశలో పయనించడానికి కోచ్, కెప్టెన్‌ల మధ్య ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి. మేం నిర్ణయించుకున్న విషయం ఏమిటంటే.. జట్టులో ఎటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా మంచి ఫలితాలను రాబట్టాలి. టీమ్‌ఇండియా ఆడే శైలిని ఫార్మాట్‌కు అనుగుణంగా మార్చాలనుకుంటున్నాం. మూడు ఫార్మాట్లను ఒక నిర్దిష్ట మార్గంలో ఆడాలనుకుంటున్నాం’ అని రోహిత్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని