Team India: ‘మీరు ప్రపంచకప్ గెలవాలంటే ఆ లీగ్‌లో ఆడకండి’
టీమ్‌ఇండియా ఆటగాళ్లకు రోహిత్ శర్మ కోచ్ దినేశ్ లాడ్ కీలక సూచనలు చేశాడు. జట్టులోని స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు మిస్ కావొద్దని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సారథిగా రాణిస్తున్నా మెగా ఈవెంట్లలో తనదైన మార్క్ చూపలేకపోతున్నాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడంతో రోహిత్ ఆటతీరు, కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించి భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మతోపాటు ఇతర టీమ్‌ఇండియా ఆటగాళ్లకు దినేశ్ లాడ్ కీలక సూచనలు చేశాడు. జట్టులోని స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు మిస్ కావొద్దని సూచించాడు.
ఓపెనర్లు ఫిక్స్ కాకపోవడంతో గత ఏడు నెలలుగా జట్టులో స్థిరత్వం లేదని, ఓపెనింగ్ బౌలర్లు కూడా మారుతూనే ఉన్నారని దినేశ్ లాడ్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు పనిభారం పేరుతో అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ భారత టీ20 లీగ్‌లో ఆడటంపై ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘పని భారంతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామంటున్నారు. అసలు ప్రొఫెషనల్ క్రికెటర్లకు వర్క్‌లోడ్ సమస్య ఏంటి..? అలాంటప్పుడు మీరు భారత టీ20 లీగ్‌లో ఎందుకు ఆడుతున్నారు? మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే భారత టీ20 లీగ్‌లో ఆడకండి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏ విషయంలోనూ రాజీ పడకూడదు. ఆటగాళ్లు భారత టీ20 లీగ్‌లో కాంట్రాక్టులను వదులుకోవాలా వద్దా? అని నేనెలా చెప్పగలను. దీనిపై వారే నిర్ణయం తీసుకోవాలి. క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేస్తే వారికి ఈ లీగ్‌లో మంచి జీతం లభిస్తుంది’ అని రోహిత్ శర్మ కోచ్ దినేశ్ లాడ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇటీవల మూడు టీ20ల సిరీస్ ముగియగా.. నవంబర్ 25న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. ఈ రెండు సిరీస్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. బంగ్లా టూర్‌తో ఈ ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు